logo

బిసంకటక్‌లో గెలిచేదెవరు?

రాయగడ జిల్లాలో గత 13వ తేదీన ఎన్నికలు జరగ్గా ఓట్ల్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, అభ్యర్థుల మధ్య ఉత్కంఠ నెలకొంటోంది.

Published : 27 May 2024 03:39 IST

జగన్నాథ్‌ సరక, నీలమాధవ హికాక, జగన్నాథ నుండ్రుకా, నీలమాధవ ఉలక 

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో గత 13వ తేదీన ఎన్నికలు జరగ్గా ఓట్ల్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, అభ్యర్థుల మధ్య ఉత్కంఠ నెలకొంటోంది. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏయే కేంద్రాల్లో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలేసుకుంటున్నారు. రాయగడ జిల్లాలో అతి ప్రాధాన్యం గల నియోజకవర్గం బిసంకటక్‌ అని చెప్పాలి. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బిజద అభ్యర్థిగా జగన్నాథ్‌ సరక, కాంగ్రెసు నుంచి నీలమాధవ హికాక, భాజపా తరఫున జగన్నాథ్‌ నుండ్రుకా, రేబల్‌ కాంగ్రెసు అభ్యర్థిగా నీలమాధవ ఉలక, మరో నలుగురు పోటీ చేశారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గం బిజదకు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. మంత్రి జగన్నాథ్‌ సరకా ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బిజద తరఫున పోటీ చేసి గెలుపొందడమే కాకుండా, మంత్రిగానూ పనిచేశారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని చూస్తున్నారు. రాష్ట్ర బిజద కార్యదర్శి సుధీర్‌ దాస్‌ బిజద అభ్యర్థి గెలుపునకు ఎంతగానో కృషి చేశారు.

కాంగ్రెసు తరఫున పోటీ చేస్తున్న నీలమాధవ హికాక గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ అయిదేళ్లు తన బలాన్ని పెంచుకున్నారు. బిజద అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సారి తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో బిజదలో పలు పదవుల్లో కొనసాగిన జగన్నాథ్‌ నుండ్రుకా ఈ సారి భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు. కమలం గాలులు వీస్తుండడంతో తాను గెలుస్తానని ఆయన అంటున్నారు. మాజీ మంత్రి స్వర్గీయ డొంబురు ధర ఉలక తనయుడు నీలమాధవ ఉలక నాయకులు, కార్యకర్తల మద్దతుతో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ప్రజలు తమవైపు ఉన్నారని తన విజయం తథ్యమని ఉలకా అంటున్నారు. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది జూన్‌ నాలుగు వరకు వేచి చూడాల్సిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు