logo

జగ్‌దేవ్‌ అరెస్ట్‌

ఖుర్దా అసెంబ్లీ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత జగ్‌దేవ్‌ను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 27 May 2024 03:47 IST

ప్రశాంత జగ్‌దేవ్‌ 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఖుర్దా అసెంబ్లీ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత జగ్‌దేవ్‌ను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిలికా అసెంబ్లీ సిటింగ్‌ ఎమ్మెల్యే జగ్‌దేవ్‌ ఈసారి ఖుర్దా అసెంబ్లీ స్థానానికి భాజపా తరఫున పోటీ చేశారు. శనివారం ఇక్కడ పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం బెలగడ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన జగ్‌దేవ్‌ ప్రిసైడింగ్‌ అధికారికి దుర్భాషలాడి వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు రాగా, బిజద నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాత్రి దీనిపై ప్రిసైడింగ్‌ అధికారి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో జగ్‌దేవ్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది.

బిజదపై చర్యలు తీసుకోవాలి

మూడోవిడత పోలింగ్‌లో బిజద నేతలు, కార్యకర్తలు కొందరు వీరంగం సృష్టించారని, వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకత్వం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి, ఢెంకనాల్‌ జిల్లాలోని ఛెండిపద, కటక్‌ జిల్లా అఠాగఢ్‌ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న బిజద అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేశారని, బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు