logo

గంజాం జిల్లాలో 348 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. గంజాం జిల్లాలో ఉత్తీర్ణత 97.06 శాతమని జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) అమితా పట్నాయక్‌ చెప్పారు.

Published : 27 May 2024 03:50 IST

పదో తరగతి పరీక్షల్లో ఘనత

ఉద్విగ్న క్షణాలు..: చరవాణిలో ఫలితాలు చూసుకుంటున్న విద్యార్థినులు 

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. గంజాం జిల్లాలో ఉత్తీర్ణత 97.06 శాతమని జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) అమితా పట్నాయక్‌ చెప్పారు. సాయంత్రం ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ జిల్లాలోని 617 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని, 348 ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయన్నారు. మరో 24 ప్రైవేటు పాఠశాలలు సంపూర్ణ ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. ఉత్తీర్ణత శాతంలో గంజాం జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉందని డీఈఓ పట్నాయక్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని