logo

అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్‌ లెస్‌

కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి.

Updated : 20 May 2024 10:18 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: కోడి మాంసం ధర వినియోగదారులకు చుక్కలు చూపెడుతోంది. సామాన్యుడు మాంసం కొనుగోలు చేయడానికి భయపడుతున్నాడు. జిల్లాలో వందల సంఖ్యలో దుకాణాలు ఉండగా, రోజూ వేలాది కేజీల మాంసం విక్రయాలు సాగుతుంటాయి. ఇందులో బ్రాయిలర్, బండ, ఫారం రకాలవి ఉంటాయి. వీటిలోనూ బ్రాయిలర్‌ విక్రయాలే అధికంగా జరుగుతుంటాయి. గతనెల వరకు రూ. 250 మీద సాగిన మాంసం ధర ప్రస్తుతం రూ. 300లకు చేరువలో ఉంది. ప్రస్తుతం వేసవి కావడంతో కోళ్లు దిగుబడి తగ్గిపోవడంతో పౌల్ట్రీల నిర్వహణ భారంగా మారింది. ఫలితంగా కోడి ధర పెరిగిపోయింది. ఎన్నికల సమయంలో చికెన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఎన్నికల తంతు ముగిసినా ప్రస్తుతం అరకొరగా శుభకార్యాలు జరుగుతుండటంతో కోడికి గిరాకీ కొనసాగుతోంది. దీనికి తోడు నెలరోజులుగా సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతోంది. ఇది మరో నెలపాటు ఉంటుంది. ఫలితంగా కోడిమాంసంపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం కేజీ కోడి రూ. 158 ఉండగా, మాంసం రూ.286, స్కిన్‌ లెస్‌ రూ.296గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో డిమాండు, పోటీ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కేజీకి రూ.10 అటు, ఇటుగా విక్రయిస్తున్నారు. కేజీ రూ. 260 ఉన్న సమయంలో రోజూ 100 కేజీల మాంసం విక్రయించగా, ఇప్పుడు అది 60 నుంచి 70 కేజీలకు పడిపోయినట్లు నక్కపల్లికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నారు.  కోడిగుడ్డు ధర రూ. 6గా ఉంది. ఇది కూడా భారంగా మారడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని