కూటమితో పిల్లలకు బంగారు భవిత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
మహిళలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న కొణతాల
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని వేల్పులవీధిలో ఆదివారం కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొణతాల ముందుగా గౌరీపరమేశ్వరులను దర్శించుకుని ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు ఇచ్చారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. చిన్నారి సైకిల్‌పై ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సీతారామ కల్యాణ మండపం వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
జబర్దస్త్ నటుల ప్రచారం
ఇంటింటా ప్రచారంలో గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేయాలని గుర్తును చూపిస్తున్న షకలక శంకర్, అప్పారావు
అనకాపల్లి, లక్ష్మీదేవిపేట, కొత్తూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని పలు ప్రాంతాల్లో జబర్దస్త్ నటులు షకలక శంకర్, అప్పారావు ఆదివారం పర్యటించారు. దేమునిగుమ్మం, గొల్లవీధి, వేంకటేశ్వరస్వామి కోవెల రోడ్డు, దిబ్బపాలెం తదితర ప్రాంతాల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పత్రాలు పంపిణీ చేశారు. వ్యాపారుల వద్దకు వెళ్లి గాజుగ్లాసు, కమలం గుర్తులను చూపించి ఉత్సాహంగా ప్రచారం చేశారు. పలువురు వీరితో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార పార్టీ అండ.. అడ్డులేని దందా..
[ 02-06-2024]
అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు.. మున్సిపల్ నేత పేరు చెప్పి మరికొందరు ఎలమంచిలిలో అక్రమంగా ఇసుక, కంకర వ్యాపారం చేస్తూ రెండు చేతులా అక్రమంగా సంపాదిస్తున్నారు. -
భీమిలి తీరంలో విధ్వంసం ‘విజయ’వంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్‌జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
విఘాతం కలిగిస్తే సహించం
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు. శనివారం ఇక్కడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు
[ 02-06-2024]
ఈ నెల నాలుగున ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మురుగు సొగసు కనుమా!
[ 02-06-2024]
సాధారణంగా వర్షాకాలం వచ్చేలోపే జీవీఎంసీ అధికారులు గెడ్డలు, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించి పూడికలు తీయాలి. అయితే ఈ ఏడాది పనులు ఆలస్యంగా మొదలు కావడంతో ఇప్పటికీ చాలా చోట్ల పూడిక పనులు పూర్తికాలేదు. -
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితం
[ 02-06-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి పోలైన ఓట్లను ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని 21 హాళ్లలో లెక్కిస్తామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో నగరం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి విశాఖలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. -
సింగపూర్‌కు ‘ఐఎన్ఎస్ శివాలిక్’ నౌక
[ 02-06-2024]
భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్ఎస్ శివాలిక్’ సింగపూర్ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్ నౌక -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
[ 02-06-2024]
సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించిందని ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ‘ఈ ఏడాది మార్చిలో 201 నౌకల ద్వారా 76,22,732 మెట్రిక్ టన్నుల సరకు రవాణా ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. -
3వ తేదీన విశాఖ- గుణుపురం రైలు రద్దు
[ 02-06-2024]
నౌపడా-గుణుపురం మార్గంలో తిరుగుతున్న విశాఖ- గుణుపురం రైలు ఈ నెల 3వ తేదీన రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.