ఆరేళ్ల చిన్నారి.. అదరగొట్టే మెమొరీ..!

ఆరేళ్ల చిన్నారి తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అదరగొడుతోంది. గుక్క తిప్పుకోకుండా విమాన సర్వీసుల పేర్లు చెబుతూ ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.

Updated : 11 Jul 2021 06:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరేళ్ల చిన్నారి తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అదరగొడుతోంది. గుక్క తిప్పుకోకుండా విమాన సర్వీసుల పేర్లు చెబుతూ ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది. హరియాణాలోని పంచకులకు చెందిన ఆర్నా గుప్తా.. కేవలం విమానాల వెనక భాగాన తోకలపై ముద్రించిన చిత్రాల ఆధారంగా ఏకంగా 93 విమాన సర్వీసు సంస్థల పేర్లను చక చకా చెప్పేస్తోంది. నిమిషం వ్యవధిలోనే దాదాపు 100 సర్వీసుల పేర్లు చెప్పి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తాజా రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఈ నెల 1న ఆమెకు అందజేసింది. ఆమె విమాన సర్వీసులు చెబుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పోస్టు చేసింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ రికార్డు సాధించగలిగినట్లు ఆర్నా తెలిపింది. తమ కుమార్తెకు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ఉన్నట్లు తాము ముందే గుర్తించామని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్‌లో ఏదైనా గొప్పగా సాధించగలదనే విశ్వాసంతో అప్పటి నుంచి ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు తల్లి నేహా గుప్తా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని