విహరిస్తే రూ.లక్షల జీతం!

కరోనా మహమ్మారి వల్ల విహారయాత్రకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ఇంటర్నెట్‌, సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటక ప్రాంతాలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన అమెరికాకు చెందిన బీర్‌ తయారీ

Updated : 03 Oct 2020 00:33 IST


(photo: Michelob Ultra twitter - Hopewell Culture National Historical Park facebook)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి వల్ల విహారయాత్రకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది ఇంటర్నెట్‌, సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటక ప్రాంతాలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన అమెరికాకు చెందిన బీర్‌ తయారీ సంస్థ మైకెలాబ్‌ అల్ట్రా తమ సంస్థలో ‘చీఫ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఆఫీసర్‌’ ఉద్యోగాన్ని సృష్టించి అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతోంది. తమ సంస్థ బీర్‌ తాగుతూ.. పర్యటిస్తుంటే నెలకు 50వేల డాలర్లు(దాదాపు రూ. 36లక్షలు)జీతంతోపాటు ప్రోత్సాహకాలు కూడా ఇస్తుందట. 

ఆరు నెలల కాల పరిమితి ఉండే ఈ చీఫ్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఆఫీసర్‌గా ఎంపికైన వారు తాము ఇచ్చే కాంపర్‌ వ్యాన్‌లో యూఎస్‌ వ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కుల్లో పర్యటించాలని మైకెలాబ్‌ అల్ట్రా సంస్థ వెల్లడించింది. ఆ వ్యానులో బాత్‌రూమ్‌, ఫ్రిడ్జ్‌ అందులో సంస్థ తయారు చేసిన బీర్లు ఉంటాయట. వీటిని తాగుతూ.. జాతీయ పార్కుల్లో విహరిస్తూ ఆకట్టుకునే ఫొటోలు తీసి సంస్థకు చెందిన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి తనతోపాటు స్నేహితుడు, భార్య, శునకం ఇలా ఎవరైనా ఒకరిని వెంటతీసుకెళ్లొచ్చు. విహారయాత్రలు ఇష్టపడేవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించింది. అమెరికాలో 400కుపైగా జాతీయ పార్కులు ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని