- TRENDING
- T20 World Cup
- TG Muncipal Elections
Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద కరకట్టకు గండిపడే ప్రమాదం.. గుర్తించిన రైతులు

అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద కృష్ణా కరకట్టకు గండిపడే ప్రమాదాన్ని రైతులు ఆదివారం రాత్రి గుర్తించారు. కట్టనుంచి వరదనీరు లీకవ్వడాన్ని గుర్తించిన రాజధాని రైతులు.. కట్టమీదకు చేరుకొని గండి పూడ్చే పనులు స్వచ్ఛందంగా చేపట్టారు. అధికారులకు సమాచారం అందించారు. త్వరగా స్పందించకుంటే వరదనీరు సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని











