మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా కె.ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, షహీనా, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మి, కటారి రేవతీరావు నియమితులయ్యారు. చైర్‌పర్సన్ సహా సభ్యులంతా ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆమె తెరాసలో చేరారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.







