Modi Cabinet: 37 మందికి మంత్రులుగా తిరిగి దక్కని చోటు

మోదీ 2.0 సర్కారులో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్‌ ర్యాంకు అమాత్యులు కాగా, మిగిలిన 30 మంది సహాయమంత్రులు.

Updated : 10 Jun 2024 07:27 IST

 వారిలో స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకుర్‌ సహా ఏడుగురు కేబినెట్‌ ర్యాంకు అమాత్యులు 

దిల్లీ: మోదీ 2.0 సర్కారులో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్‌ ర్యాంకు అమాత్యులు కాగా, మిగిలిన 30 మంది సహాయమంత్రులు. స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకుర్, నారాయణ్‌ రాణె, పరుషోత్తం రూపాలా, అర్జున్‌ ముండా, ఆర్‌.కె.సింగ్, మహేంద్రనాథ్‌ పాండే మోదీ 2.0 ప్రభుత్వంలో క్యాబినెట్‌ ర్యాంకు మంత్రులుగా ఉన్నారు. వారికి మోదీ 3.0 మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ప్రస్తుతం మంత్రి పదవిని కోల్పోయినవారిలో 18 మంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైనవారే. గత ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉండి.. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పదవి నిలబెట్టుకున్న ఏకైక నేత ఎల్‌.మురుగన్‌. 

మోదీ 2.0 సర్కారులో సహాయమంత్రులుగా పనిచేసి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కనివారు.. 

వి.కె.సింగ్, ఫగ్గణ్‌సింగ్‌ కులస్తే, అశ్వినీ చౌబే, దన్వే రావ్‌సాహెబ్‌ దాదారావ్, సాధ్వీ నిరంజన్‌ జ్యోతి, సంజీవ్‌ బల్యాన్, రాజీవ్‌ చంద్రశేఖర్, సుభాష్‌ సర్కార్, నిశిత్‌ ప్రమాణిక్, రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్, ప్రతిమా భౌమిక్, మీనాక్షి లేఖి, ముంజపరా మహేంద్రభాయ్, అజయ్‌ కుమార్‌ మిశ్ర, కైలాశ్‌ చౌధరీ, కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్,  భారతీ ప్రవీణ్‌ పవార్, కౌశల్‌ కిశోర్, భగవంత్‌ ఖుభా, వి.మురళీధరన్, భాను ప్రతాప్‌సింగ్‌ వర్మ , జాన్‌ బార్లా, బిశ్వేశ్వర్‌ టుడు, భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్, దేవుసిన్హ్‌ చౌహాన్, అజయ్‌ భట్, ఎ.నారాయణ స్వామి, సోమ్‌ ప్రకాశ్, రామేశ్వర్‌ తేలి, దర్శనా విక్రమ్‌ జర్దోశ్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని