Milam Village: ఆరు దశాబ్దాల తర్వాత.. ఆ పల్లెలో మళ్లీ ‘జన’కళ!

Eenadu icon
By National News Team Updated : 01 Nov 2025 21:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పిథౌరాగఢ్‌: భారత్‌- చైనా 1962 యుద్ధం సమయంలో ఉత్తరాఖండ్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లను వీడారు. అందులో పిథౌరాగఢ్‌ జోహార్‌ లోయలోని మిలం గ్రామం ఒకటి. ఆరు దశాబ్దాల తర్వాత ఈ ఊర్లో మళ్లీ జనసందోహం నెలకొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘వైబ్రంట్‌ విలేజ్‌’ కార్యక్రమంలో భాగంగా ఈ పల్లె రూపురేఖలు మారుతున్నాయి. 1962 తర్వాత ఇటీవల స్థానికంగా ఓ నూతన భవనం నిర్మితమైంది. పర్యాటకుల కోసం దాన్ని హోమ్‌స్టేగా మార్చారు.

కొన్ని పాత ఇళ్లకు మరమ్మతులు చేశారు. గ్రామానికి రోడ్లు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు మెరుగుపర్చుతున్నారు. సమీపంలోని 12 గ్రామాలకు విద్యుత్తు సదుపాయాన్ని అందించేందుకు రూ.20 కోట్ల వ్యయంతో ఓ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. మిలం హిమానీనదం, నందా దేవి ఆలయం, ట్రెక్కింగ్‌ ఇక్కడి పర్యాటక ఆకర్షణలు. 2024లో 1,280గా ఉన్న పర్యాటకుల సంఖ్య.. ఈ ఏడాది 3,200కు పెరిగింది. యుద్ధానికి ముందు 500 కుటుంబాలకు నిలయంగా ఉన్న ఈ గ్రామం.. పర్యాటకం, పునరావాసం ద్వారా కొత్త ఊపిరి పోసుకుంటోంది.

- ఈటీవీ భారత్‌

Tags :
Published : 01 Nov 2025 20:29 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని