Atiq Ahmed: అతీక్‌ హత్య కోసం.. రిపోర్టింగ్‌ ట్రైనింగ్‌!

రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌లపై కాల్పులు జరిపేందుకు ముందు రోజు ప్రధాన నిందితుడు తివారీ రిపోర్టింగ్‌ శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 20 Apr 2023 13:57 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్లు అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రధాన నిందితుడు లవ్లేశ్‌ తివారీ రిపోర్టింగ్‌ కోసం స్వల్పకాలం పాటు శిక్షణ కూడా తీసుకున్నాడట. ఈ మేరకు అతడికి శిక్షణ ఇచ్చిన ముగ్గురిని కూడా ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఓ స్థానిక ఛానెల్‌కు పని చేస్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు తివారీకి ట్రైనింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న అతీక్‌ అహ్మద్‌ భార్య షాహిస్తా పర్వీన్‌ కోసం కౌశాంబిలో పోలీసులు విస్త్రృతంగా గాలిస్తున్నారు. 

అతీక్‌ అహ్మద్‌, అష్రాఫ్‌ అహ్మద్‌ సోదరులను శనివారం రాత్రి వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా.. హంతకులు వారిద్దరిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.  మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలడుగుతున్న సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. మొదట అతీక్‌ తలపై ఒక వ్యక్తి కాల్పులు జరపగా.. ఆ తర్వాత అష్రాఫ్‌పై కాల్పులు కొనసాగాయి. అయితే, ఈ కాల్పులకు తెగబడిన లవ్లేశ్‌ తివారీతోపాటు అరుణ్ మౌర్య, సన్నీ సింగ్‌లు కూడా జర్నలిస్టుల్లా వ్యవహరించేందుకు హత్యకు ముందు రోజు శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని