అంచనాలకు భిన్నంగా ఫలితాలు.. లైవ్‌లో కన్నీరు పెట్టిన యాక్సిస్‌ మై ఇండియా ఎండీ

యాక్సిస్‌ మై ఇండియా ఛైర్మన్‌ ప్రదీప్‌ గుప్తా భావోద్వేగానికి గురయ్యారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పడంతో లైవ్‌లో పాల్గొన్న ఆయన కంటతడి పెట్టుకున్నారు.

Updated : 04 Jun 2024 20:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా లైవ్‌లో కంటతడి పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై అంచనాలు తప్పడమే అందుకు కారణం. ఇండియా టుడే ఎన్నికల ఫలితాల లైవ్‌ కవరేజీలో పాల్గొన్న ప్రదీప్‌ గుప్తా .. ప్యానెల్‌ చర్చ సందర్భంగా ఎగ్జిట్‌ పోల్స్‌ అంశం గరించి ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంచనాలు తారుమారవడంతో భావోద్వేగానికి గురైన ఆయన లైవ్‌లోనే కంటతడి పెట్టుకున్నారు. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అనేక సర్వేలు భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించారు. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 361-401 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 131-166 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే భాజపా మెజారిటీ మార్క్‌ను దాటినా సర్వేలో అంచనా వేసిన సీట్లను మాత్రం గెలుచుకోలేకపోయింది.

కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ ఎమోషనల్‌ పోస్ట్‌

‘‘యాక్సిస్‌ మై ఇండియా గత 10 ఏళ్లుగా ఎగ్జిట్‌ పోల్స్‌ను నిర్వహిస్తోంది. రెండు లోక్‌సభ ఎన్నికలతో సహా మొత్తం 69 ఎన్నికలకు సర్వేలు చేశాం. మా అంచనాలు 65 సార్లు కరెక్ట్‌గా ఉన్నాయి’’ అని నిన్న ఓ వార్తా సంస్థతో ప్రదీప్‌ గుప్తా అన్నారు. కానీ.. ఈసారి సర్వేల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్కోసారి ఇలాంటి సర్వేల ఫలితాలు తారుమారవుతుంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని