Prashant Kishor: కుల రాజకీయాలకు అతీతంగా ఉంటేనే బిహార్‌ అభివృద్ధి - ప్రశాంత్‌ కిశోర్‌

Eenadu icon
By National News Team Published : 02 Nov 2025 00:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) మాట్లాడుతూ.. కుల రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. నీతీశ్‌ ప్రభుత్వంలో అవినీతి నేతలు ఉన్నారని, అశోక్‌ చౌధరీ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు.

అయితే 150.. లేదంటే 10 సీట్లు: ప్రశాంత్‌ కిశోర్‌

‘‘నీతీశ్‌ ప్రభుత్వంలో అత్యంత అవినీతిపరుడు అశోక్‌ చౌధరీ. ఆయన జేడీయూలో ఉన్నారు. తండ్రిది కాంగ్రెస్‌ పార్టీ. కుమార్తె ఎల్‌జేపీ (రామ్‌ విలాస్‌).. ఆయన అన్ని పార్టీలకు చెందిన నేత. ఆయన అవినీతిని బయటపెట్టాగానే పరువు నష్టం దావా వేస్తానని నాపై బెదిరింపులకు దిగారు. పది రోజుల తర్వాత ఆయన భయపడి.. ప్రజాకోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. బిహార్‌ నుంచి రూ.500-1000కోట్లు లూటీ చేసిన ఆయన.. ఇప్పుడు డబ్బులు పంచుతున్నారు’’ అని జేడీయూ సీనియర్‌ నేతపై ప్రశాంత్‌ కిశోర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. షేక్‌పురాలో ప్రచారం నిర్వహించిన ఆయన అధికార ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు రెండు దశల్లో జరగనుండగా.. తొలి దశ పోలింగ్‌ నవంబర్‌ 6న జరగనుంది. నవంబర్‌ 11న రెండో దశ.. నవంబర్‌ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు