Rajasthan: పశువుల సంతలో మృతి చెందిన రూ.21 కోట్ల విలువైన గేదె

Eenadu icon
By National News Team Updated : 02 Nov 2025 16:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.21 కోట్ల విలువైన గేదె (Buffalo Worth Rs.21 Crore) పశువుల సంతలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో అక్టోబర్‌ 30వ తేదీ నుంచి నవంబర్‌ 5 వరకు వారం రోజుల పాటు ప్రసిద్ధ పుష్కర్ పశువుల సంతలో వివిధ జంతువుల ప్రదర్శన (Pushkar Animal Fair)ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే శుక్రవారం పుష్కర్ పశువుల సంతలో కోట్ల రూపాయల విలువైన గేదెలు, గుర్రాలను వాటి యజమానులు తీసుకువచ్చారు. సంత జరుగుతున్న సమయంలో రూ.21కోట్ల విలువైన ఓ గేదె అకస్మాత్తుగా కిందపడిపోయింది. దీంతో సంత యాజమాన్యం పశువైద్యులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ గేదె మృతిచెందింది. 

ఈ విషయాన్ని ఓ జంతు సంరక్షణ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. గేదె బలంగా, లావుగా కనిపించడానికి, వ్యాపార లాభాల కోసం దాని యజమానులు వివిధ రకాల ఉత్ర్పేరకాలను ఇంజెక్షన్‌ల రూపంలో ఇస్తుండడం వల్ల ఆరోగ్యం క్షీణించి గేదె మరణించినట్లు ఆ సంస్థ పేర్కొంది. దీంతో జంతువుల సంరక్షణపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Tags :
Published : 02 Nov 2025 16:33 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు