Bullets found: సినీ నటుడి బ్యాగులో 40 బుల్లెట్ల గుర్తింపు

మాజీ ఎమ్మెల్యే, తమిళ సీనియర్‌ నటుడు కరుణాస్‌ బ్యాగులో తూటాలు బయటపడ్డాయి.

Published : 03 Jun 2024 00:03 IST

చెన్నై: సీనియర్‌ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ బ్యాగులో పెద్ద సంఖ్యలో బుల్లెట్లు బయటపడటం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆయన విమానం ఎక్కేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. తనిఖీల సమయంలో ఆయన బ్యాగులో దాదాపు 40 బుల్లెట్లు గుర్తించినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నటుడిని ప్రశ్నించగా.. తన వద్ద ఉన్న లైసెన్స్‌ తుపాకీకి సంబంధించి తగిన డాక్యుమెంట్లను విమానాశ్రయ అధికారులకు చూపించినట్లు సమాచారం. కొచ్చి వెళ్లేందుకు విమానానికి సమయం అవుతుందనే తొందరలో బ్యాగ్‌లో బుల్లెట్లు తీయడం మరిచిపోయానని కరుణాస్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, బుల్లెట్లు ఉన్న బ్యాగుతో విమానం ఎక్కేందుకు నిరాకరించిన అధికారులు.. తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు ఆయన్ను అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని