Railways: న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌ మూసివేస్తున్నారా?! ఇందులో నిజమెంత?

న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది.

Published : 27 May 2024 22:41 IST

దిల్లీ: రైల్వేల ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌ను శాశ్వతంగా లేదా ఈ ఏడాది చివరివరకు మూసివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఇక్కడినుంచి రాకపోకలు సాగించే రైళ్లన్నింటినీ సమీప స్టేషన్లకు షిఫ్ట్ చేస్తారంటూ జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ సమాచారం ఫేక్‌ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టంచేసింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని తెలుపుతూ ‘ఎక్స్‌’ వేదిగా పోస్ట్‌ పెట్టింది. న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌ను ఎప్పటికీ మూసివేయబోమని తెలిపింది. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు.. అవసరాన్నిబట్టి కొన్ని రైళ్లను మళ్లించడమో/రెగ్యులేట్‌ చేయడమో జరుగుతుందని పీఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. రైళ్ల మళ్లింపునకు సంబంధించిన సమాచారం ముందుగానే ప్రయాణికులకు తెలియజేస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని