Lalu: లాలూ ప్రసాద్‌, తేజస్వికి దిల్లీ కోర్టు సమన్లు

Eenadu icon
By National News Team Published : 18 Sep 2024 12:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పట్నా: మనీ లాండరింగ్‌ కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వినీ యాదవ్‌కు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణం (Land for jobs Scam)’తో సంబంధమున్న మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లాలూకు సమన్లు జారీ చేసింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌ ప్రతాప్ యాదవ్‌కు, మరికొందరికి న్యాయస్థానం సమన్లు పంపింది. అక్టోబరు 7లోపు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. గతేడాది మార్చిలో దిల్లీ, బిహార్‌, ముంబయిలలో మొత్తం 25 చోట్ల సోదాలు చేపట్టింది. అనంతరం లాలూ కుటుంబసభ్యులు ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. లాలూ సతీమణి, బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్‌, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగి, లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్‌లతోపాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌లపై అభియోగాలు మోపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని