Delhi High Court: మైనర్‌తో శారీరక సంబంధం అత్యాచారమే

బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ మైనర్‌తో శారీరక సంబంధాన్ని కొనసాగించడం అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ కోర్టు స్పష్టం చేసింది.

Published : 11 Jun 2024 05:52 IST

బాలిక సమ్మతితో జరిగినా అది నేరమే: దిల్లీ కోర్టు

దిల్లీ: బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ మైనర్‌తో శారీరక సంబంధాన్ని కొనసాగించడం అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ కోర్టు స్పష్టం చేసింది. 14 ఏళ్ల బాలిక గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్‌ జడ్జి అమిత్‌ సహ్రావత్‌ ఈ విషయం తెలిపారు. 2015 జనవరిలో నమోదైన ఈ కేసు విచారణ ముగింపు దశకు వచ్చింది. బాలికకు జన్మించిన బిడ్డకు తండ్రి నిందితుడేనని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని