Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్‌

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి హద్దుదాటి వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో దాడి చేస్తామంటూ బెదిరించాడు. 

Published : 06 Dec 2023 16:02 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ అతడు విడుదల చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. దీంతో దిల్లీ(Delhi)లో అలర్ట్ ప్రకటించారు.

ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నాలుగున మొదలైన ఈ సమావేశాలు.. డిసెంబర్ 22 వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో డిసెంబర్ 13లోగా పార్లమెంట్‌పై దాడికి పాల్పడతామని పన్నూ చేసిన బెదిరింపులను.. భద్రతా సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. ‘పార్లమెంట్  ప్రాంగణం మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశాం. సమావేశాలు జరుగుతున్నప్పుడు.. మేం అత్యంత అప్రమత్తంగా ఉంటాం.  శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అనుమతించం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని భద్రతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అలాగే దిల్లీవ్యాప్తంగా కూడా భద్రతను పెంచినట్లు తెలిపారు.

పార్ట్‌టైం జాబ్‌ మోసాలు.. 100కి పైగా వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

సరిగ్గా డిసెంబర్ 13నే 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఆ దాడికి సూత్రధారి అయిన అఫ్జల్‌ గురు పోస్టర్‌.. పన్నూ ప్రస్తుతం విడుదల చేసిన వీడియోలో దర్శనమిచ్చింది. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు కుట్ర చేశాయని, దానికి ప్రతిస్పందనగానే ఈ దాడి ఉంటుందని బెదిరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని