Delhi: భానుడి ఉగ్రరూపం.. దిల్లీలో తొలిసారి 52.3 డిగ్రీలు నమోదు

దేశ రాజధాని నగరవాసులు ఎండలతో అల్లాడిపోతున్నారు. దిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 29 May 2024 18:02 IST

దిల్లీ: ఈశాన్య భారతదేశంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. సూర్యతాపానికి దేశ రాజధాని నగరం దిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. దిల్లీలో బుధవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దిల్లీలో గతంలో ఎన్నడూలేనంతగా ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ముంగేష్‌పుర్‌లో 52.3 డిగ్రీల సెల్షియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని తెలిపారు. మంగళవారం నార్త్‌ వెస్ట్‌ దిల్లీ ప్రాంతంలో 49.9 డిగ్రీలుగా నమోదు కాగా.. ఆ మరుసటిరోజే ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.  

ఇదిలాఉండగా.. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా ఏసీలు వినియోగించడంతో దిల్లీలో విద్యుత్‌ డిమాండు 8,302 మెగా వాట్‌లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇంత భారీ డిమాండ్‌ ఉండటం కూడా ఇదే అత్యధికమని పేర్కొన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు