Bomb Threat: విమానానికి బాంబు బెదిరింపు

దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి వెళ్తోన్న ఇండిగో విమానంలోని బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై ‘ఉదయం 5:30 గంటలకు బాంబు’ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు.

Published : 29 May 2024 05:55 IST

అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికుల దించివేత

దిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసర ద్వారం నుంచి జారుతూ కిందికి దిగుతున్న ప్రయాణికులు

దిల్లీ: దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి వెళ్తోన్న ఇండిగో విమానంలోని బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై ‘ఉదయం 5:30 గంటలకు బాంబు’ అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉంది. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందకు దించేసిన సిబ్బంది.. ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్‌ సిబ్బంది, విమానంలో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. 

తాజ్‌ హోటల్, ఎయిర్‌పోర్ట్‌కు కూడా..

ముంబయిలోని తాజ్‌ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు సోమవారం రాత్రి పోలీసులకు బెదిరింపు కాల్‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ కాల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని