Divya Gautam: ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి!

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు గడువు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) సమీప బంధువు దివ్యా గౌతమ్ (సోదరి వరుస) ఎన్నికల బరిలో ఉన్నారు. సీపీఐ(ఎంఎల్)కు చెందిన ఆమె, దిఘా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి గత రెండు పర్యాయాలు భాజపా నేత సంజీవ్ చౌరాసియా గెలువగా.. ఈసారి మహాగఠ్‌బంధన్ తరఫున ఆయనపై దివ్య పోటీకి దిగారు.
పట్నా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దివ్య.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో వుమెన్స్ స్టడీస్ విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు. బిట్స్ పిలానీ నుంచి పీహెచ్‌డీ చేశారు. మూడేళ్లపాటు పట్నా వుమెన్స్ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె.. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో నెగ్గి సప్లై ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. పట్నా యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలిగా (2012లో) ఉన్న సమయంలోనే దివ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది.
పట్నాలో మారింది కొంతే.. మారాల్సిందెంతో!
కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయాల్లోకి రాలేదని, సమాజంలో నిజమైన మార్పును తేవడమే తన ప్రయత్నమన్నారు. విద్య, ఉపాధి, మహిళా భద్రత, ఆరోగ్య సంరక్షణ, స్థానిక అభివృద్ధిపైనే దృష్టి పెడతానని చెబుతున్న దివ్య.. మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ప్రస్తావిస్తూ.. తన సోదరుడి పేరును కొన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేశాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 


