Electoral Bonds: ఎన్నికల బాండ్ల డేటా బహిర్గతం.. ఈసీ ప్రకటన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది.

Updated : 14 Mar 2024 23:45 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల (Electoral bonds) వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశాల మేరకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 763 పేజీలతో రెండు పార్ట్‌లుగా వెబ్‌సైట్‌  https://www.eci.gov.in/లో అప్‌లోడ్‌ చేసింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని