PM Modi: మోదీ క్యాబినెట్‌ తొలి భేటీ.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేంద్ర క్యాబినెట్‌ తొలిసారి భేటీ అయ్యింది.

Updated : 10 Jun 2024 20:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. సోమవారం సాయంత్రం తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. 7, లోక్‌ కల్యాణ్ మార్గ్‌లోని మోదీ నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మంత్రి అవాస్‌ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. 

మూడోసారి ప్రధానిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. కేబినెట్‌ భేటీకి ముందు పీఎంవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని అక్కడి అధికారులకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వంద రోజుల ప్రణాళికను మోదీ బృందం ఇప్పటికే సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని