Chennai: పాక్‌ జలసంధిని జయించిన దివ్యాంగుడు

కాళ్లు, చేతులు పని చేయకున్నా ఓ యువకుడు సముద్రాన్ని ఈది రికార్డు సృష్టించారు. పాక్‌ జలసంధిని ఈదిన తొలి దివ్యాంగుడిగా గుర్తింపు పొందారు.

Updated : 15 Apr 2023 07:04 IST

చెన్నై (వేలచ్చేరి), న్యూస్‌టుడే: కాళ్లు, చేతులు పని చేయకున్నా ఓ యువకుడు సముద్రాన్ని ఈది రికార్డు సృష్టించారు. పాక్‌ జలసంధిని ఈదిన తొలి దివ్యాంగుడిగా గుర్తింపు పొందారు. చెన్నై వడపళనికి చెందిన రాజశేఖరన్‌, వనిత దంపతుల కుమారుడు శ్రీరాం శ్రీనివాస్‌(29)కు పుట్టుకతోనే వినిపించదు, మాట్లాడలేరు. కాళ్లు, చేతులూ చచ్చుబడ్డాయి. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో నాలుగో ఏట నుంచే ఈతలో శిక్షణ పొందారు. అలా నడుము, ఛాతి భాగం ఆడిస్తూ.. సముద్రంలో ఈదడం నేర్చుకున్నారు. గతంలో కడలూర్‌ సమీపంలోని సముద్రంలో 5 కి.మీ ఈదారు. ఈ ధైర్యంతో పాక్‌ జలసంధిని ఈదేందుకు యత్నించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు శ్రీలంకలోని తలైమన్నార్‌లో ఈత ప్రారంభించారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు తమిళనాడులోని రామేశ్వరం సమీప ధనుష్కోటికి చేరుకున్నారు. ఈ ఘనతను కోల్‌కతాకు చెందిన యూనివర్సల్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ గుర్తించింది. రామనాథపురం డీఎస్పీ ఉమాదేవి ఆధ్వర్యంలో ధ్రువపత్రం, జ్ఞాపిక అందజేసి, సత్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని