కళ్లకు గంతలతో అద్భుతాలు చేస్తున్న బాలిక

పద్నాలుగేళ్ల బాలిక కళ్లకు గంతలు కట్టుకొని సైకిలు నడుపుతోంది. కరెన్సీ నోట్లు, దుస్తుల రంగులు సులభంగా గుర్తుపడుతోంది.

Published : 05 Jul 2023 04:55 IST

పద్నాలుగేళ్ల బాలిక కళ్లకు గంతలు కట్టుకొని సైకిలు నడుపుతోంది. కరెన్సీ నోట్లు, దుస్తుల రంగులు సులభంగా గుర్తుపడుతోంది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాకు చెందిన రియా తివారీని అందరూ ‘మిరాకిల్‌ కిడ్‌’ అంటున్నారు. లోహతా హర్‌పాల్‌పుర్‌ గ్రామానికి చెందిన రియా పదో తరగతి చదువుతోంది. మెడిటేషన్‌, యోగా లాంటి వాటిపై ఆసక్తి ఉన్న రియా.. తండ్రి ప్రోత్సాహంతో మిడ్‌ బ్రెయిన్‌ యాక్టివేషన్‌ కోర్సు చేసింది. మూడు నెలలపాటు సాగిన ఈ కోర్సు అనంతరం కళ్లకు గంతలు కట్టుకొని పరిసరాలను, రంగులను.. స్పర్శతో నోట్లను, పేకముక్కలను రియా సులభంగా గుర్తుపడుతోంది. కొన్ని కిలోమీటర్లు సైకిల్‌ రైడ్‌  చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని