Lottery: అదృష్టమంటే ఇదే బాసూ! పాతికేళ్లు పైలాపచ్చీసు

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆదిల్‌ఖాన్‌ జీవనోపాధి కోసం దుబాయికి వెళితే.. అదృష్టలక్ష్మి ఒక్కరోజులో ఆయనను ధనవంతుడిగా మార్చింది.

Updated : 30 Jul 2023 07:55 IST

యూపీ వాసికి అరబ్‌ లాటరీ

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆదిల్‌ఖాన్‌ జీవనోపాధి కోసం దుబాయికి వెళితే.. అదృష్టలక్ష్మి ఒక్కరోజులో ఆయనను ధనవంతుడిగా మార్చింది. యూఏఈ నిర్వహించిన మెగా ప్రైజ్‌మనీ లక్కీడ్రాలో ఆదిల్‌ఖాన్‌ తొలి విజేతగా నిలిచాడు. దీంతో ఆయన నెలనెలా రూ.5.60 లక్షల (25,000 దిర్హమ్‌లు) చొప్పున 25 ఏళ్లపాటు అందుకోనున్నాడు. ఆదిల్‌ఖాన్‌ దుబాయ్‌లోని ఓ స్థిరాస్తి సంస్థలో ఇంటీరియర్‌ డిజైన్‌ కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు. ఇటీవల యూఏఈ ‘ఫాస్ట్‌ 5’ పేరిట తీసిన లాటరీలో ఆదిల్‌ మొదటి విజేతగా నిలిచినట్లు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఎమిరేట్స్‌ లాటరీ నిర్వహించే టైచెరస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఫాస్ట్‌ 5’ లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. స్వల్ప వ్యవధిలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్‌ కావడానికి మేము ‘ఫాస్ట్‌ 5’ను తీసుకొచ్చాం. విజేత ప్రయోజనాలను ఆశించే ఒకేసారి కాకుండా నెలకోసారి ఇలా డబ్బులు ఇచ్చే ఆలోచన చేశాం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు