పట్టాలకు పగుళ్లు.. ఎర్ర వస్త్రంతో రైలును ఆపిన రైతు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి లఖ్‌నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది.

Updated : 05 Aug 2023 07:27 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి లఖ్‌నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలోని భోలాకా పురా గ్రామానికి చెందిన రైతు భన్వర్‌సింగ్‌ శుక్రవారం ఉదయం 6.00 గంటలకు తన పొలం వైపు వెళుతూ లాల్‌గోపాల్‌గంజ్‌ సమీపంలో రైల్వేట్రాక్‌పై పగుళ్లను గుర్తించాడు. అప్పుడే అటుగా వస్తున్న గోమతి ఎక్స్‌ప్రెస్‌ రైలును సైతం గమనించాడు. వెంటనే అప్రమత్తమైన భన్వర్‌సింగ్‌ ఎర్రటి వస్త్రాన్ని ఊపుతూ రైలు ఆపాలంటూ కేకలు వేశాడు. రైతు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లోకోపైలట్‌ రైలు వేగానికి బ్రేకులు వేసి నిదానంగా ఆపాడు. పట్టాలపై పగుళ్లను చూసి విస్తుపోయిన లోకోపైలట్‌.. భన్వర్‌సింగ్‌ను అభినందించాడు. వందలాది ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేసి, మరమ్మతులు పూర్తయ్యాక మళ్లీ నడిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని