స్టీల్‌ టంగ్‌ క్లీనర్‌ను మింగేసిన యువకుడు..

బ్రష్‌తో దంతధావనం చేసుకున్న యువకుడు నాలుక శుభ్రం చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు నాలికబద్ద (టంగ్‌ క్లీనర్‌)ను మింగేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా కర్మాయిని గ్రామానికి చెందిన శివకాంత్‌ (25) శుక్రవారం ఉదయం బ్రష్‌తో దంతధావనం చేసుకుంటూ.

Updated : 15 Aug 2023 07:25 IST

బ్రష్‌తో దంతధావనం చేసుకున్న యువకుడు నాలుక శుభ్రం చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు నాలికబద్ద (టంగ్‌ క్లీనర్‌)ను మింగేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా కర్మాయిని గ్రామానికి చెందిన శివకాంత్‌ (25) శుక్రవారం ఉదయం బ్రష్‌తో దంతధావనం చేసుకుంటూ. స్టీల్‌ నాలికబద్దను మింగేశాడు. దీంతో అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి మొదలైంది. సరిగా మాట్లాడలేకపోయాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ శివకాంత్‌కు శస్త్రచికిత్స చేసి.. గొంతు లోపల ఇరుక్కుపోయిన నాలికబద్దను బయటకు తీశారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైదులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని