Train Accident: కాలిన కోచ్‌లో భారీగా నోట్లకట్టలు

తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్‌ సమీపంలో యాత్రికుల కోచ్‌ శనివారం తెల్లవారుజామున దగ్ధమైన ఘటనపై విచారణ జరుగుతోంది.

Updated : 28 Aug 2023 08:23 IST

ఈనాడు, చెన్నై: తమిళనాడులోని మదురై రైల్వేస్టేషన్‌ సమీపంలో యాత్రికుల కోచ్‌ శనివారం తెల్లవారుజామున దగ్ధమైన ఘటనపై విచారణ జరుగుతోంది. ఆదివారం ఫోరెన్సిక్‌ నిపుణులు కోచ్‌లో తనిఖీ చేశారు. ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి. రూ.200, రూ.500 నోట్లు అందులో ఉన్నట్లు గుర్తించారు. యాత్రికుల కోసం దారిలో ఖర్చులకు ట్రావెల్‌ ఏజెన్సీ వారు తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. మొత్తం 63 మంది ప్రయాణికులు లఖ్‌నవూ నుంచి ప్రత్యేక కోచ్‌లో తమిళనాడుకు రాగా ఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు తేలింది. వారికోసం ఆదివారం ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. చివరికి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో వారికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దక్షిణ సర్కిల్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వేసేఫ్టీ ఏఎం చౌదరి ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని