LTT Prabhakaran: ప్రాణాలతో ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ కుమార్తె?

ఎల్‌టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్‌ కుమార్తె ప్రాణాలతో ఉన్నట్లు విడుదలైన వీడియో తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated : 15 Sep 2023 07:55 IST

చెన్నై న్యూస్‌టుడే: ఎల్‌టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్‌ కుమార్తె ప్రాణాలతో ఉన్నట్లు విడుదలైన వీడియో తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమిళ ఈలం కోరుతూ శ్రీలంకలో జరిపిన అంతర్యుద్ధంలో ఎల్‌టీటీఈ అధ్యక్షుడు ప్రభాకరన్‌ 2009లో ఆ దేశ సైన్యం చేతిలో మృతి చెందాడు. ఈ యుద్ధంలో ప్రభాకరన్‌ భార్య మదివదని, ఇద్దరు కుమారులు, కుమార్తె ద్వారక తదితరులు మృతి చెందినట్లు శ్రీలంక సైన్యం ప్రకటించింది. ప్రభాకరన్‌ ప్రాణాలతోనే ఉన్నారని పలువురు వివిధ సందర్భాల్లో ప్రకటించినా వాటిని శ్రీలంక సైన్యం ఖండించింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లో ఉంటున్న తారకా హరిధరన్‌ అనే మహిళ తాను ప్రభాకరన్‌ భార్య మదివదని సోదరినని చెబుతూ వీడియో విడుదల చేశారు. అందులో.. మదివదని, ప్రభాకరన్‌ కుమార్తె ద్వారక బతికే ఉన్నారని పేర్కొనడం సంచలనంగా మారింది. మరోవైపు శ్రీలంక సామాజిక మాధ్యమాల్లో సైతం ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ దేశంలో సర్వ మక్కల్‌కట్చి అనే సంస్థను నిర్వహిస్తున్న ఉదయకళ అనే మహిళనే ప్రభాకరన్‌ కుమార్తె ద్వారక అని అందులో పేర్కొన్నారు. ద్వారక తన పేరుని ఉదయకళగా మార్చుకుని తమిళనాడులో ఆశ్రయం పొంది ప్రస్తుతం శ్రీలంకలో ప్రజాసేవ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని