సంక్షిప్త వార్తలు

మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అభివర్ణించారు.

Updated : 28 Nov 2023 04:37 IST

గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ధన్‌ఖడ్‌

ముంబయి: మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అభివర్ణించారు. సత్యాగ్రహం, అహింస ద్వారా మహాత్మా గాంధీ మనల్ని బ్రిటిష్‌ పాలకుల బానిసత్వం నుంచి విముక్తుల్ని చేస్తే.. మనం ఏ మార్గంలో నడవాలని కోరుకుంటామో ప్రధాని మోదీ మనల్ని అదే మార్గంలో తీసుకెళ్తున్నారు అని పేర్కొన్నారు. జైన ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో ఉప రాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. ముంబయిలో ఈ వేడుకలను నిర్వహించారు. ‘జాతి, దేశం ఎదుగుదలను వ్యతిరేకించే శక్తులు ఏకం అవుతున్నాయి. మంచి జరిగితే ఆ శక్తులు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. మనముందు పెను ప్రమాదం పొంచి ఉంది. చుట్టూ ఉన్న దేశాల చరిత్ర చాలా చిన్నది. 300, 500, 700 ఏళ్ల చరిత్రే వాళ్లది. కానీ మనది 5000 ఏళ్ల చరిత్ర’ అని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు.


ఆ జాబితా నుంచి 40 వేల సంస్థలు అదృశ్యం

కొవిడ్‌ మహమ్మారి తరువాత దేశంలో 40 వేలకు పైగా ఉత్పత్తి సంస్థలు పన్ను చెల్లింపుదారుల జాబితా నుంచి అదృశ్యమయ్యాయి. వ్యాపార రంగంలో ఈ అస్థిరత, అభివృద్ధిలో క్షీణత ఆందోళనకరం. పన్ను చెల్లింపుదారుల్లో 5 శాతం తగ్గుదల నమోదవడం వ్యాపారాలకు ప్రోత్సాహాన్ని అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.  

సీతారాం ఏచూరి


మణిపుర్‌పై ప్రధానికి ప్రత్యేక శ్రద్ధ!

ప్రధాని మోదీ దూరదృష్టి కలిగిన నేత అని, మణిపుర్‌పై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించారు. 7 నెలలుగా అక్కడ హింస రగులుతున్నా, 184 మంది ప్రాణాలు కోల్పోయినా, 67 వేల మంది నిరాశ్రయులైనా ప్రధాని ఇప్పటివరకూ వెళ్లకపోవడాన్నే ప్రత్యేక శ్రద్ధ అంటారా సీఎంగారూ?  

 మహువా మొయిత్రా


ధూమపానం మానండి

పొగాకు కారణంగా క్యాన్సర్‌ ముప్పు మాత్రమే కాదు, టైప్‌-2 మధుమేహం బారినపడే ప్రమాదాన్ని 40 శాతం పెంచుతుంది. ఇది అంధత్వం, అవయవాలను కోల్పోవడం లాంటి రుగ్మతలకు దారితీస్తుంది. తక్షణం ధూమపానం అలవాటును మానండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందండి.     

 ప్రపంచ ఆరోగ్య సంస్థ


దయాగుణంతో ఎన్నో ప్రయోజనాలు

మీరు గొప్ప స్థాయికి వెళ్లడం కన్నా దయాగుణంతో ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. దానివల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీకు నిజమైన స్నేహితులు, ఆప్తులు ఉంటారు. మీ పిల్లలు దయగల  వ్యక్తులుగా ఎదుగుతారు. ఆనందకరమైన సమాజ నిర్మాణానికి, సంతోషకరమైన జీవితానికి ఇదే సరైన మార్గం. 

 దలైలామా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు