పార్లమెంటు సమావేశాల్లో 18 బిల్లులు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కశ్మీర్‌, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, 3 నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి.

Published : 30 Nov 2023 04:41 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కశ్మీర్‌, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, 3 నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. సమావేశాలు డిసెంబరు 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీన ముగుస్తాయి. లోక్‌సభ సెక్రటేరియట్‌ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లూ పార్లమెంటు ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్‌ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు ప్రాతినిధ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్‌ జరగనుంది. ఐపీసీ, సీపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లులను కేంద్రం తీసుకొస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు