మణిపుర్‌లో శాంతి వీచిక

జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది.

Updated : 30 Nov 2023 04:52 IST

  కేంద్రంతో యూఎన్‌ఎల్‌ఎఫ్‌ ఒప్పందం

దిల్లీ: జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (యూఎన్‌ఎల్‌ఎఫ్‌)తో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. చరిత్రాత్మక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. బుధవారం దిల్లీలో యూఎన్‌ఎల్‌ఎఫ్‌ శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని తెలిపారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ఫలించినట్లయిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని