మొయిత్రా అంశం అలజడి రేపుతుందా!

అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతోంది.

Published : 04 Dec 2023 06:34 IST

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం మీద ఉన్న భాజపా.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాలతో సిద్ధమవుతోంది. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా అంశం ఈ సమావేశాల్లో తీవ్ర అలజడిని రేపే అవకాశం ఉంది. ఆమెను విచారించిన నైతిక విలువల కమిటీ.. తన నివేదికను పార్లమెంటుకు సమర్పించనుంది. ఇందులో కమిటీ.. ఆమెను బహిష్కరించాలని సిఫార్సు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోమవారం ఉదయం ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. మొయిత్రా అంశంతో పాటు.. ద్రవ్యోల్బణం, మణిపుర్‌ హింస, కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్న తీరుపై ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో వలస పాలన నాటి క్రిమినల్‌ చట్టాల మార్పు, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి విధి విధానాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని