డీప్‌ఫేక్‌ నియంత్రణపై సమీక్షించిన కేంద్రం

తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

Published : 06 Dec 2023 04:57 IST

దిల్లీ: తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా మాధ్యమాల వేదికలన్నీ కొత్తచట్టానికి 100 శాతం కట్టుబడి ఉండేలా రెండు రోజుల్లో అడ్వైజరీని జారీ చేయనున్నామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆన్‌లైన్‌ వినియోగదారుల భద్రత, నమ్మకాలకు సవరించిన ఐటీ నిబంధనల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని