వీడియో కాన్ఫరెన్స్‌ విచారణ ప్రసారాలు నిలిపివేత

కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది.

Published : 06 Dec 2023 05:11 IST

కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. ఇకపై ఈ పీఠాలలో వీటిని నిలిపి వేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరాళె వెల్లడించారు. సాంకేతికత ప్రయోజనాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని