ప్లాస్టిక్‌ వ్యర్థాలతో టైల్స్‌ తయారీ

పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్‌ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది.

Updated : 08 Dec 2023 12:56 IST

పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్‌ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది. మైసూరు పురపాలక సంస్థ సాయంతో ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్‌ కవర్లను రీసైక్లింగ్‌ చేసి పర్యావరణ హిత టైల్స్‌ను తయారు చేస్తోంది. మైసూరులోని విద్యారణ్యపురంలో జాగృత్‌ టెక్‌ సంస్థ పరిశ్రమను ప్రారంభించింది. పురపాలక సంస్థ సేకరించిన చెత్తలో నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లను వేరు చేసి వాటితో నాణ్యమైన టైల్స్‌ను రూపొందిస్తోంది. ప్లాస్టిక్‌ కవర్లను మెషిన్‌ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. వాటిని వేడి చేసి కరిగించి ఒక ముద్దలాగా మారుస్తారు. ఆ తర్వాత అచ్చు యంత్రంలో పెట్టి టైల్స్‌ తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌ టైల్స్‌ సిమెంట్‌ టైల్స్‌తో పోలిస్తే తక్కువ ధర అని, మన్నిక ఎక్కువని జాగృత్‌ టెక్‌ డైరెక్టర్‌ దినేశ్‌ చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు