ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ప్రధాన కార్యదర్శి పాటించాల్సిందే

దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 08 Dec 2023 05:54 IST

పాలనను స్తంభింపచేయకూడదు: సుప్రీంకోర్టు

దిల్లీ: దేశరాజధాని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం నియమించినా, ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ప్రధాన కార్యదర్శిని నియమించే అధికారం కేంద్రానికి ఉందంటూ గత నెల 29న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు సంబంధించి పూర్తి పాఠాన్ని బుధవారం సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ అధికారులు రాజకీయంగా తటస్థంగా ఉండాలి. దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్రం ఎంపిక చేసినా.. ఎన్నికైన ప్రభుత్వ ఆదేశాలను ఆయన పాటించాల్సిందే. తన చర్యలతో ప్రభుత్వ పాలనను స్తంభింపచేయకూడదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని