ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా అమూల్‌: స్వర్ణోత్సవాల్లో మోదీ ఆకాంక్ష

అమూల్‌ బ్రాండ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల కంపెనీగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ వృద్ధి రేటు రెండు శాతం ఉండగా మన దేశంలో ఆరు శాతమని చెప్పారు.

Published : 23 Feb 2024 06:00 IST

అహ్మదాబాద్‌: అమూల్‌ బ్రాండ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల కంపెనీగా మార్చాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ వృద్ధి రేటు రెండు శాతం ఉండగా మన దేశంలో ఆరు శాతమని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 8వ స్థానంలో ఉన్న ‘గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ సమాఖ్య’ (జీసీఎంఎంఎఫ్‌) త్వరలోనే మొదటి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని, ఇది మోదీ హామీ అని చెప్పారు. జీసీఎంఎంఎఫ్‌ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని అహ్మదాబాద్‌లోని ‘నరేంద్రమోదీ స్టేడియం’లో నిర్వహించిన సమావేశంలో దాదాపు లక్షమంది రైతులు, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో పాడి పరిశ్రమ టర్నోవర్‌ రూ.10 లక్షల కోట్లుగా ఉందని, వరి, గోధుమ, చెరకు దిగుబడులు మొత్తం కలిపినా అంతకాదని వెల్లడించారు. అమూల్‌ నుంచి రోజూ రూ.200 కోట్ల విలువైన 3.5 కోట్ల లీటర్ల పాలు 50కి పైగా దేశాలకు వెళ్తున్నాయని చెప్పారు. రూ.600 కోట్లతో చేపట్టిన అమూల్‌ విస్తరణ పనుల్ని ఆయన ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని