మణిపుర్‌ హింసకు కారణమైన హైకోర్టు ఉత్తర్వు వెనక్కి

మణిపుర్‌ హింసకు ఆజ్యం పోసిన కీలక ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. మార్చి 27, 2023న ఇచ్చిన తీర్పులో మెజారిటీ మైతేయ్‌ వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని, దీనిపై 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

Published : 23 Feb 2024 04:06 IST

ఇంఫాల్‌: మణిపుర్‌ హింసకు ఆజ్యం పోసిన కీలక ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. మార్చి 27, 2023న ఇచ్చిన తీర్పులో మెజారిటీ మైతేయ్‌ వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని వేగంగా పరిశీలించాలని, దీనిపై 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో మైనారిటీ కుకీలు భగ్గుమన్నారు. హింస చెలరేగింది. ఈ మారణకాండలో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. బుధవారం వెలువరించిన తీర్పులో మైతేయ్‌లను ఎస్టీల్లోకి చేర్చాలన్న పేరాను న్యాయస్థానం తొలగించింది. ఎస్టీ జాబితాను సవరణ లేదా మార్చడానికి సుప్రీంకోర్టుకు అధికారం లేదని ‘స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర వర్సెస్‌ మిలింద్‌’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా ఇచ్చిన తీర్పునకు ఈ పేరా వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. మైతేయ్‌లు కూడా తమ సమీక్ష పిటిషన్‌లో తమను ఎస్టీల్లోకి చేర్చాలా లేదా అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు