పాము కాటుకు విరుగుడు

పాము కాటుకు విరుగుడు కనిపెట్టడంలో బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐ.ఐ.ఎస్‌.సి) శాస్త్రవేత్తలు సఫలమయ్యారు.

Published : 23 Feb 2024 05:55 IST

దిల్లీ: పాము కాటుకు విరుగుడు కనిపెట్టడంలో బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐ.ఐ.ఎస్‌.సి) శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. అమెరికాకు చెందిన స్కిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. హెచ్‌ఐవి, కొవిడ్‌-19 వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ఈ పరిశోధనకు ప్రాతిపదికగా నిలిచింది. తమ సింథటిక్‌ యాంటీబాడీ త్రాచుపాము, నాగుపాము (కింగ్‌ కోబ్రా), కట్లపాము, బ్లాక్‌మాంబా వంటి పాముల విషాన్ని ఎదుర్కోగలదని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందులు తయారుచేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు హానికరంగా పరిణమిస్తోంది. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్‌ యాంటీబాడీలను తయారుచేయడం వీలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని