హత్యకేసు నిందితుడు కైఫ్‌తో తేజస్వీ ఫొటోలు

ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. షార్ప్‌షూటర్‌, హత్యకేసు నిందితుడు మహ్మద్‌ కైఫ్‌తో ఆయన దిగిన చిత్రాలు వైరల్‌ కావడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నారు.

Published : 25 Feb 2024 05:39 IST

వివాదంలో ఆర్జేడీ నేత

పట్నా: ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ వివాదంలో చిక్కుకున్నారు. షార్ప్‌షూటర్‌, హత్యకేసు నిందితుడు మహ్మద్‌ కైఫ్‌తో ఆయన దిగిన చిత్రాలు వైరల్‌ కావడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నారు. భాజపా ఆ చిత్రాలను షేర్‌ చేస్తూ ఆర్జేడీని దుయ్యబట్టింది. ‘‘తేజస్వీ నేతృత్వంలో ఆర్జేడీకి కొత్త పంథా ఏమీ లేదు. కొత్త సీసాలో పాత సారా చందంగానే ఉంది. బిహార్‌లో నేరస్థులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత ఆర్జేడీదే. ఈ ఇద్దరి సమావేశం యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. వారిమధ్య మంచి అనుబంధం ఉంది’’ అని విమర్శలు చేసింది. తేజస్వీ నిర్వహిస్తోన్న ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’లో భాగంగా సివాన్‌లో వారిద్దరు భేటీ అయినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని