నెల రోజుల్లో 60 లక్షల మందికి బాల రాముడి దర్శనం!

అయోధ్య రామ మందిరానికి నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది.

Published : 25 Feb 2024 05:24 IST

లఖ్‌నవూ: అయోధ్య రామ మందిరానికి నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఇందులో 25 కిలోల బంగారు, వెండి ఆభరణాలూ ఉన్నట్లు వెల్లడించింది. జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకాశ్‌ గుప్తా శనివారం తెలిపారు. విరాళాల విషయంలో.. ట్రస్టు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ లావాదేవీల లెక్కలు తేలాల్సి ఉందన్నారు. గత నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భక్తులు కానుకగా ఇచ్చే బంగారు, వెండి ఆభరణాల విలువ మదింపు, కరిగించడం తదితర బాధ్యతలను భారత ప్రభుత్వ టంకశాలకు అప్పగించినట్లు ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌ మిశ్ర తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని