సీయూఈటీ (యూజీ)- 2024 పరీక్షకు దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Published : 28 Feb 2024 04:22 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్‌, పెన్ను విధానంలో నిర్వహణకు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. సీయూఈటీ (యూజీ) పరీక్షకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 వరకు ఆన్‌లైనులో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 26 అర్ధరాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైనులో ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. జూన్‌ 30న ఫలితాలను విడుదల చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు