రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి శాంతన్‌ మృతి

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన శాంతన్‌ (55) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.

Updated : 29 Feb 2024 05:35 IST

చెన్నై (ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన శాంతన్‌ (55) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. 1991లో శ్రీపెరుంబుదూరులో చోటుచేసుకున్న రాజీవ్‌గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించిన ఏడుగురిలో శ్రీలంకకు చెందిన సుతంతిరరాజా అలియాస్‌ శాంతన్‌ ఒకరు. ఆయన్ను 2022 నవంబరులో సుప్రీంకోర్టు విడుదల చేసింది. అనంతరం తిరుచ్చి సెంట్రల్‌ జైల్‌ ప్రాంగణంలోని ప్రత్యేక శిబిరంలో ఉంటున్నారు. తనను శ్రీలంకకు పంపాలని ప్రధాని మోదీ తదితర కేంద్ర మంత్రులకు కొద్దినెలల కిందట లేఖ రాశారు. మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. కాలక్రమంలో ఆయనకు కాలేయం దెబ్బతినడం, కాళ్ల వాపులు తదితర పలు సమస్యలు వేధించాయి. దీంతో ఆయన్ని చెన్నై రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. కొద్ది రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వచ్చింది. బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని