మంచి న్యాయమూర్తి కావాలంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి: సీజేఐ

మంచి న్యాయమూర్తి లేదా న్యాయవాది కావాలంటే ప్రజల జీవితాలను అర్థం చేసుకోవడం కీలకమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Published : 29 Feb 2024 04:25 IST

దిల్లీ: మంచి న్యాయమూర్తి లేదా న్యాయవాది కావాలంటే ప్రజల జీవితాలను అర్థం చేసుకోవడం కీలకమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ప్రసన్న.బి.వరాలేలకు బుధవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) సన్మానం చేసింది. ఈ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ.. ‘‘న్యాయమూర్తికి చట్టపరమైన శక్తి మాత్రమే సరిపోదు. మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలన్న బలీయమైన కోరిక కీలకం. చట్టంపై అవగాహన, అవి అమల్లోకి తెచ్చిన సందర్భం ముఖ్యమైనదే. అంతిమంగా ప్రజల సమస్యలపై అవగాహనే మనల్ని మంచి న్యాయమూర్తులు, న్యాయవాదులుగా తీర్చిదిద్దుతుంది’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని