గగన్‌యాన్‌ వ్యోమగామి నా భర్తే

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను తాను ఇటీవల వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మలయాళ నటి లీనా వెల్లడించారు.

Published : 29 Feb 2024 05:12 IST

 మలయాళ నటి లీనా వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను తాను ఇటీవల వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మలయాళ నటి లీనా వెల్లడించారు. గగన్‌యాన్‌ బృందాన్ని ప్రధాని మోదీ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత లీనా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘జనవరి 17న నేను, ప్రశాంత్‌ వివాహం చేసుకున్నాం. వృత్తిపరంగా కొన్ని కారణాల వల్ల ఈ విషయాన్ని ఇప్పటివరకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది’’ అని లీనా రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు