నేటి నుంచి ‘ఎన్నికల బలగాల’ తరలింపు

లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాలకు కేంద్ర భద్రతా బలగాల తరలింపు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

Published : 01 Mar 2024 03:37 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాలకు కేంద్ర భద్రతా బలగాల తరలింపు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల్లో మొత్తం 3.4 లక్షల మంది భద్రతా సిబ్బందిని వినియోగించనుండగా తొలి విడతగా 2లక్షల మందిని ఎన్నికల సంఘం తరలించనుంది. తొలుత నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలకు సిబ్బందిని పంపనున్నట్లు గురువారం ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాలకు బలగాలను ముందస్తుగా పంపుతున్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని